6, డిసెంబర్ 2014, శనివారం

నేను కవితలు  రాయాలని  ఎప్పుడూ  అనుకోలేదు కానీ  నా ఆలోచనలు ,మాటలు తెలుగు భాష పై మక్కువ ఎక్కువ గా వుంటాయి. నేను తెలుగు భాష ను పవిత్రంగా  ప్రాణంగా భావిస్తాను, నేను మాట్లాడే  మాటలు ప్రాస తో సందర్భోచితంగా ,సరళంగా ,సభ్యతగా వుంటాయి. నా ఈ భాషాభిమానాన్ని అందరితో పంచుకోవాలనే  ఆశతో నా ఈ "వెన్నెల" అనే బ్లాగ్ ద్వార నాలోని భావాలను పోస్ట్ చేస్తున్నాను  మన మానవాళి జీవితంలో ప్రేమెకు ఒక ప్రత్యేకమైన ,పవిత్రమైన స్థానం వుంది కాని ప్రస్తుతం ప్రేమ అనే పదం   విచ్చలవిడిగా పిచ్చిగా తయారైంది అసలు  ఈ     ప్రేమంటే ఏమిటి ఎలా పుడుతుంది, దాని లక్షణాలు ఎలా వుంటాయి అనేది  "ఎవరు నువ్వు " నా ఈ చిన్న కవిత ద్వార అడగాలని నా ప్రయతనం   . ధన్యవాదములు ... బ్రహ్మ ద్వారపూడి .................                                      

 "ఎవరు నువ్వు"              
 నా చిన్ననాటి పరిచయా నివా ? 
 పూర్వజన్మతాలుకా పరిమళానివా ?
 ఎవరు నువ్వు ? 
 తొలిసారి నిన్ను చూడగానే ఊహల్లోంచి వాస్తంలోకి వచ్చాను . 
 డబ్భై ఆరేళ్ళ కోసారి కనిపించే హేలీ తోకచుక్కలా 
 నూట నలభై నాలుగు నెలలకోసారి పూసే కురంజి పువ్వులా
 నీ రాకతో నా పరిసరా లను చైతన్యం చేసావు
 నీ పరిచయంతో ఇంతవరకు నేను చూడని రంగుల్ని,
 నాకు తెలియని రుచుల్ని నా జీవితంలోకి మోసుకొచ్చావు 
 ఎవరు నువ్వు ?
 నీవొక ప్రవాహం, దోసిట్లో ఇమడవు
 నీవొక పాదరసం,ఊహల్ని ఒక్కచోట నిలువనీయవు
 ప్రతిక్షణం నిన్ను చూడాలని
 ఎదురుగా పరిగెత్తి పలకరించాలని .... ఎన్ని కల లు 
 నీవు నా మనసును పదహారేల్లదగ్గరే ఆపేసి
 మిగిలిన వయసంతా నీ జ్ఞాపకాలుగా మిగులుస్తవేమో అనిపిస్తుంది ...
 కుదిరితే నీ సాహచర్యంతో
 కుదరకపోతే నీ ఆలోచనలతో గడపాలనిపిస్తుంది
 ఇంతగా నన్ను ప్రభావితం చేసిన నువ్వు,
  ఎవురు నువ్వు
 నీవు కనిపిస్తే నా ఆవేశం చల్లారుతుంది
 నీవు మాట్లాడితే నా ఆందోళన ఆవిరవుతుంది
 మూడుకోలతలూ నీలో దాచుకొన్న " ఫొర్తు డైమెన్షన్ " రూపానివి నీవు
 ప్రేమో ,ఆకర్షనో 
 నీవు నన్ను వదిలి వెళ్ళినప్పుడల్లా ప్రాణం పోతున్నంత బాధగా వుంటుంది
 నా గుండె కవాటాలు పెలిపోతఎమో అన్నంత భయం కలుగుతుంది
 నీ ముందు మోకాల్లమీద కూర్చొని ,తలవంచి 
 నా జీవితంలో నేను ఎవరినీ ఇంతగా అభిమానిన్చాలేదు అని చెప్పాలనిపిస్తుంది
 నీ మనసులో ఏమూలో కొంచెం చోటివ్వమని అడగాలనిపిస్తుంది
 నీవు నాతో గొడవ పడడం 
 నేను నీతో తిట్లు కాయడం ఇస్తమనిపిస్తుంది 
 అంతగా నేను ఆరాటపడే నీవు
 ఎవురు నువ్వు
 నువ్వు మన చుట్టూ వున్నవాళ్ళు చెట్లు ,పూలు ,తీగలు ,పరిసరాలు మారిపోవచ్చు
 కాని నీపై నాకున్న అభిమానం ఎప్పటికీ మారదు 
 ఇంతకీ ఎవరు నువ్వు
 నా ఆలోచనలకి ఎంతకీ అర్ధం కాని ప్రశ్నవా? 
 నా మనసను అర్ధం చేసుకునే అందమైన జవాబువా ?

1 కామెంట్‌లు:

17 డిసెంబర్, 2014 8:53 AMకి వద్ద, Blogger saisahithi చెప్పారు...

Nice. good words and images. Try to reduce spelling mistakes

 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి కామెంట్‌లను పోస్ట్ చేయి [Atom]

<< హోమ్